Andhra Pradesh: ఏపీ గురుకులాల్లో ఇకపై ఎంఈసీ కోర్సు ఉండదు: మంత్రి మేరుగ నాగార్జున

  • ప్రస్తుతం ఏపీ గురుకుల విద్యాలయాల్లో అందుబాటులో ఉన్న ఎంఈసీ
  • వచ్చే విద్యా సంవత్సరం నుంచి రద్దు చేయనున్నట్లు మంత్రి నాగార్జున ప్రకటన
  • ఎంఈసీ స్థానంలో ఎంపీసీ, బీపీసీ కోర్సులను ప్రవేశపెడతామని వెల్లడి
ap minister meruga nagarjuna said mec in gurukulas will be cancelled fromnext year

ఏపీలో విద్యా బోధనకు సంబంధించి వైసీపీ సర్కారు మరో కీకల నిర్ణయం తీసుకుంది. ఏపీ గురుకులాల్లో ఇప్పటిదాకా విద్యార్థులకు అందుబాటులో ఉన్న ఎంఈసీ (మ్యాథ్స్, ఎకనమిక్స్, కామర్స్) కోర్సును రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున సోమవారం ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. గణితంతో పాటు ఆర్థిక శాస్త్రంపై మంచి పట్టు సాధించాలనుకునే వారు ఈ కోర్సును ఎంపిక చేసుకుంటున్న సంగతి తెలిసిందే.


ప్రస్తుతం ఏపీ గురుకుల విద్యాలయాల్లో అందుబాటులో ఉన్న ఎంఈసీ కోర్సును రద్దు చేస్తున్నట్లు మంత్రి నాగార్జున ప్రకటించారు. ఈ కోర్సు స్థానంలో ఎంపీసీ, బీపీసీ కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎంఈసీ కోర్సు రద్దు నిర్ణయం వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలులోకి రానుందని కూడా మంత్రి ప్రకటించారు.

More Telugu News