Telangana: బిల్లు విషయమై రాజ్ భవన్ కు వచ్చి చర్చించమంటూ... తెలంగాణ సర్కారుకు లేఖ రాసిన గవర్నర్ తమిళిసై

  • విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బిల్లుకు ఆమోదం తెలిపిన అసెంబ్లీ
  • గవర్నర్ ఆమోదం కోసం రాజ్ భవన్ లో ఉండిపోయిన బిల్లు
  • గవర్నర్ ఆమోదం తెలిపితేనే వర్సిటీలో ఖాళీల భర్తీకి అవకాశం
  • విద్యా శాఖ మంత్రితో పాటు యూజీసీకి లేఖ రాసిన తమిళిసై
ts governor tamilisai writes a lettes to state government to clarify her doubts on new bills

తెలంగాణ సర్కారు అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే విషయంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయమై ఆమె రాష్ట్ర ప్రభుత్వానికి సోమవారం లేఖ రాశారు.  

ఇటీవలి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తెలంగాణ సర్కారు 7 అంశాలకు సంబంధించిన బిల్లులకు ఆమోద ముద్ర వేసింది. వాటిలో రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో నియామకాలకు సంబంధించిన విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బిల్లు కూడా ఉంది. ఈ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపితే... రాష్ట్ర ప్రభుత్వం వర్సిటీల్లో ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టే అవకాశం ఉంది.  

ఈ విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బిల్లుకు ఆమోదం తెలిపే విషయంపై తమిళిసై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి లేఖ రాశారు. ఈ బిల్లుకు ఆమోదం తెలిపితే భవిష్యత్తులో ఏమైనా అవరోధాలు ఎదురవుతాయా? అన్న విషయమై మీరు స్వయంగా రాజ్ భవన్ కు వచ్చి చర్చించాలని మంత్రికి గవర్నర్ లేఖ రాశారు. అదే సమయంలో ఈ బిల్లుకు ఆమోదంతో ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయా? అన్న విషయంపై వివరణ ఇవ్వాలని తమిళిసై యూజీసీకి కూడా లేఖ రాశారు.

More Telugu News