Hemant Soren: ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ కు సుప్రీంకోర్టులో భారీ ఊరట

  • మైనింగ్ లీజు వ్యవహారంలో సొరేన్ పై కేసులు
  • హైకోర్టు తీర్పును పక్కన పెట్టిన సుప్రీంకోర్టు
  • సత్యమేవ జయతే అని సొరేన్ ట్వీట్
Hemant Soren gets relief in Supreme Court

మైనింగ్ లీజు వ్యవహారంలో ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఝార్ఖండ్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఝార్ఖండ్ ప్రభుత్వం, హేమంత్ సొరేన్ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టేసింది. వాస్తవానికి సీజేఐ యూయూ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం గత ఆగస్టులో విచారణ జరిపి, తీర్పును రిజర్వ్ చేసింది. 

తాము తీర్పును వెలువరించేంత వరకు ఈ పిటిషన్లపై ఎలాంటి చర్యలు చేపట్టవద్దని సుప్రీం ఆదేశించింది. ఈ రోజు తీర్పును వెలువరించింది. హైకోర్టు తీర్పును పక్కన పెడుతున్నట్టు ప్రకటించింది. దీనిపై హేమంత్ సొరేన్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... 'సత్యమేవ జయతే' అని రాసుకొచ్చారు. మరోవైపు ఇదే అంశంలో హేమంత్ సొరేన్ కు ఈడీ ఇటీవల సమన్లు జారీ చేసింది. అయితే, ఆయన మాత్రం ఇంతవరకు ఈడీ విచారణకు హాజరుకాలేదు.

More Telugu News