New Delhi: కాలుష్యంతో ఢిల్లీలో 80 శాతం కుటుంబాల ఉక్కిరిబిక్కిరి

  • ప్రతి కుటుంబంలో ఒకరికి కాలుష్య సంబంధిత సమస్య
  • గొంతు నొప్పి, కళ్ల మంట, తలనొప్పి, నిద్రలేమితో సతమతం
  • లోకల్ సర్కిల్స్ సర్వేలో వెల్లడి
80 percent Delhi and NCR families suffering ailments due to toxic air says a Survey

ఢిల్లీ, జాతీయ రాజధాని రీజియన్ (ఎన్సీఆర్)లో వాయు కాలుష్యం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆ ప్రాంతంలో మెజారిటీ కుటుంబాలు కాలుష్యం వల్ల ఇబ్బందిని ఎదుర్కొంటున్నాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ సెక్టార్ లో నివసిస్తున్న 80 శాతం కుటుంబాల్లో గత కొన్ని వారాల్లో కనీసం ఒక్కరైనా వాయు కాలుష్య సంబంధిత వ్యాధులను ఎదుర్కొన్నారని కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.

 ఢిల్లీ-ఎన్సీఆర్ లో గాలి నాణ్యత ప్రస్తుతం తీవ్రంగా కలుషితమైంది. విషపూరితమైన గాలి అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఈ కారణంగా దాదాపు 18 శాతం మంది ప్రజలు ఆసుపత్రులను సందర్శించినట్లు, దాదాపు 22 శాతం మంది తమ కుటుంబంలో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులు ఇప్పటికే డాక్టర్‌ ను సంప్రదించినట్లు తేలింది. 

సర్వేలో పాల్గొన్న 8,097 మందిలో 69 శాతం మంది తాము గొంతు నొప్పి లేదా దగ్గుతో ఇబ్బంది పడుతున్నట్టు వెల్లడించారు. 56 శాతం మంది కళ్లు మండుతున్నట్లు ఫిర్యాదు చేశారు. 50 శాతం మంది ముక్కు కారటం, 44 శాతం మంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది (ఆస్తమా), 44 శాతం మంది తలనొప్పితో బాధపడుతున్నారు. 44 శాతం మంది నిద్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని ఐదు కుటుంబాలలో నలుగురు వ్యక్తులు కాలుష్య సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారని, గత ఐదు రోజులుగా పరిస్థితి మరింత దిగజారిందని లోకల్ సర్కిల్స్ వ్యవస్థాపకుడు సచిన్ తపారియా చెప్పారు.

More Telugu News