guava: జామ పండు దొంగిలించాడని కొట్టి చంపారు.. ఉత్తరప్రదేశ్ లో దారుణం

  • దళిత కుటుంబంలో విషాదం
  • విచక్షణారహితంగా కొట్టారని కుటుంబ సభ్యుల ఆరోపణ
  • తోట యజమానిపై కేసు పెట్టిన పోలీసులు
Dalit man beaten to death for stealing a guava

సరదాగా అడవిలోకి వెళ్లిన ఓ యువకుడు తిరిగొస్తూ ఓ జామపండు తెచ్చుకున్నాడు. అది చూసి జామతోట యజమానులు ఆ యువకుడిపై దాడి చేశారు. విచక్షణారహితంగా కొట్టడంతో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని మానేనా గ్రామానికి చెందిన దళిత యువకుడు ఓంప్రకాశ్ గ్రామం పక్కనే ఉన్న అడవికి వెళ్లాడు. తిరిగొస్తుండగా జామ తోటలో కిందపడ్డ ఓ పండును వెంట తెచ్చుకున్నాడు. గ్రామంలోకి వస్తున్న ఓంప్రకాశ్ ను జామ తోట యజమానులు భీంసేన్, బన్వారీ గమనించి నిలదీశారు. ఆపై మిగతా గ్రామస్థులతో కలిసి ఓంప్రకాశ్ పై దాడి చేశారు.

జామ కాయలు దొంగిలించాడని ఆరోపిస్తూ విచక్షణారహితంగా కొట్టారు. దెబ్బలు తట్టుకోలేక ఓంప్రకాశ్ స్పృహ తప్పాడు. దీంతో ఓంప్రకాశ్ ను ఆసుపత్రిలో చేర్పించి భీంసేన్, బన్వారీ వెళ్లిపోయారు. చికిత్స పొందుతూ ఓంప్రకాశ్ చనిపోవడంతో ఆ దళిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. ఎస్సీ, ఎస్టీ యాక్ట్ తో పాటు మిగతా సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

More Telugu News