TDP: చంద్రబాబుపై రాళ్ల దాడి చేసింది వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ప్రధాన అనుచరులే: టీడీపీ

  • ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చంద్రబాబు రోడ్ షోపై రాళ్లు విసిరిన అగంతుకులు
  • నిందితులు పరిమి కిషోర్, బెజవాడ కార్తీక్ లేనన్న టీడీపీ
  • ఇద్దరు నిందితులు వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రధాన అనుచరులేనని వెల్లడి
  • రాళ్లు విసురుతున్న నిందితుల ఫొటోలను విడుదల చేసిన వైనం
tdp releases photos of stone pelting on chandrababu in nandigama and names the accused

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు లక్ష్యంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. పట్టణంలో చంద్రబాబు రోడ్ షో నిర్వహిస్తుండగా... వాహనంపై నిలుచున్న చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. ఈ రాళ్లు చంద్రబాబుకు తగలలేదు గానీ... చంద్రబాబుకు సెక్యూరిటీ విధుల్లో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుబాబుకు తగిలాయి. దీంతో మధుబాబుకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధం జరిగింది. 


తాజాగా ఈ దాడికి పాల్పడిన వారు వైసీపీకి చెందిన వారేనంటూ టీడీపీ ఓ ప్రకటన విడుదల చేసింది. చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని రాళ్ల దాడికి పాల్పడిన వారు పరిమి కిషోర్, బెజవాడ కార్తీక్ లేనని టీడీపీ తన ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా వీరిద్దరూ వైసీపీ ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్సీల ప్రధాన అనుచరులేనని కూడా ఆరోపించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా టీడీపీ విడుదల చేసింది. ఓ విద్యుత్ స్తంభం ఎక్కిన కిషోర్, కార్తీక్ లు రాళ్లు రువ్వగా... వారికి రాళ్లు అందించేందుకు కింద నిలుచున్న వారు రాళ్లతో నిండి ఉన్న సంచుల ఫొటోలను కూడా టీడీపీ సదరు ఫొటోల్లో చూపించింది. అంతేకాకుండా చంద్రబాబు లక్ష్యంగానే రాళ్ల దాడి జరిగిందని కూడా టీడీపీ ఆరోపించింది.

More Telugu News