Allu Arjun: అనూ ఇమ్మాన్యుయేల్ యాటిట్యూడ్ పై స్పందించిన వెన్నెల కిశోర్!

  • హిట్ టాక్ తెచ్చుకున్న 'ఊర్వశివో రాక్షసివో'
  • వెన్నెల కిశోర్ ను ఇంటర్వ్యూ చేసిన అల్లు శిరీష్ 
  • తన రోల్స్ గురించి ప్రస్తావించిన వెన్నెల కిశోర్ 
  • చిన్న చిన్న గోల్స్ మాత్రమే పెట్టుకుంటానని వెల్లడి
Allu Sirish andVennela Kishore Interview

సునీల్ తరువాత స్టార్ కమెడియన్ గా ఆ స్థాయిలో వెన్నెల కిశోర్ తన జోరు చూపిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ఆయన లేని సినిమా లేదంటే అతిశయోక్తి లేదు. వెన్నెల కిశోర్ తన కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్రలను చేస్తూ వెళుతున్నాడు. తాజాగా అల్లు శిరీష్ హీరోగా చేసిన 'ఊర్వశివో రాక్షసివో' సినిమాలోను ఆయన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్రను పోషించాడు. ఇప్పుడు ఈ సినిమా హిట్ టాక్ తో థియేటర్లో రన్ అవుతోంది. 

ఈ సినిమాకి సంబంధించి అల్లు శిరీష్ - వెన్నెల కిశోర్ మధ్య సరదా సంభాషణ కొనసాగింది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్రలను ఎక్కువగా చేయడానికి కారణం ఏమిటని ఆయనను శిరీష్ అడిగాడు. అందుకు వెన్నెల కిశోర్ స్పందిస్తూ .. "నేను అమెరికాలో కొంతకాలం పాటు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేశాను. సాఫ్ట్ వేర్ కంపెనీలకి సంబంధించిన వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందనేది నాకు తెలుసు. వాళ్ల డ్రెస్సింగ్ .. మాట తీరు నాకు బాగా అలవాటు. అందువల్లనే ఆ తరహా పాత్రలు నన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి. 

ఇక నేను ఎక్కువగా బయట టీషర్టులు .. హుడ్డీస్ వాడుతుంటాను. సినిమాల్లోను అవే కావాలని ముందుగానే చెబుతుంటాను. ఆ డ్రెస్సింగ్ కూడా ఆ పాత్రలు కనెక్ట్ కావడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. సాఫ్ట్ వేర్ కంపెనీల్లో చేసేవారు ఎన్నో గోల్స్ పెట్టుకుని నానా టెన్షన్ పడుతుంటారు. కానీ ఎలాంటి గోల్స్ పెట్టుకోకుండా నేను కూల్ గా నా పని చేసుకునేవాడిని. వెబ్ సిరీస్ లు చూడటం నా హాబీ. అనూ ఇమ్మాన్యుయేల్ తో ఇంతకుముందు నాలుగైదు సినిమాలు చేశాను. ఆమెకి యాటిట్యూడ్ ఉందని అంటూ ఉంటారు. కానీ పాపం అలాంటిదేం లేదు. సీరియస్ గా కనిపిస్తుంది గానీ .. చాలా ఫన్నీగా గా మాట్లాడుతుంది" అంటూ చెప్పుకొచ్చాడు.

More Telugu News