Andhra Pradesh: అయ్యన్న కేసులో 467 సెక్షన్ చెల్లదని ఎలా చెబుతారు?... విశాఖ కోర్టును ప్రశ్నించిన హైకోర్టు

  • అయ్యన్న రిమాండ్ కు విశాఖ కోర్టు తిరస్కరణ
  • విశాఖ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేసిన సీఐడీ
  • కేసును కొట్టేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన అయ్యన్న
  • రెండు పిటిషన్లపై విచారణను ఈ నెల 10కి వాయిదా వేసిన కోర్టు
ap high court issues notices to ayyannapatrudu and his son rajesh

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేశ్ ల రిమాండ్ ను తిరస్కరిస్తూ విశాఖ చీఫ్ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పును ఏపీ సీఐడీ హైకోర్టులో సవాల్ చేసింది. లంచ్ మోషన్ పిటిషన్ రూపంలో సీఐడీ దాఖలు చేసిన ఈ పిటిసన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు... అయ్యన్న, రాజేశ్ లకు నోటీసులు జారీ చేసింది. అదే సమయంలో తనపై సీఐడీ అధికారులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ అయ్యన్న దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను కూడా విచారణకు స్వీకరించిన హైకోర్టు... ఈ రెండు పిటిషన్లపై తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. 

ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అయ్యన్న, రాజేశ్ లపై నమోదైన కేసులో సెక్షన్ 467 వర్తించదని ఎలా చెబుతారని విశాఖ కోర్టును హైకోర్టు ప్రశ్నించింది. అంతేకాకుండా అయ్యన్న, రాజేశ్ లకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు.... తదుపరి విచారణ నాటికి కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీ సీఐడీతో పాటు అయ్యన్న కూడా లంచ్ మోషన్ పిటిషన్ల రూపంలో దాఖలు చేసిన పిటిషన్లు రెండింటిపై విచారణను హైకోర్టు వాయిదా వేయడం గమనార్హం.

More Telugu News