Vijay: 'వరిసు' నుంచి ఫస్టు సింగిల్ ప్రోమో రిలీజ్!

  • విజయ్ హీరోగా రూపొందుతున్న ద్విభాషా చిత్రం 
  • దర్శకత్వం వహిస్తున్న వంశీ పైడిపల్లి 
  • సంగీతాన్ని అందించిన తమన్ 
  • రేపు రిలీజ్ అవుతున్న ఫస్టు సింగిల్ 
  • జనవరి 12వ తేదీన సినిమా విడుదల    
Varisu First Single Promo Release

తెలుగు - తమిళ భాషల్లో విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి ఒక సినిమా చేస్తున్నాడు. తెలుగులో ఈ సినిమాకి 'వారసుడు' అనీ .. తమిళంలో  'వరిసు' అనే టైటిల్స్ ను ఖరారు చేశారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంది.

తాజాగా తమిళ వెర్షన్ 'వరిసు' నుంచి ఫస్టు సింగిల్ కి సంబంధించిన ప్రోమోను వదిలారు. 'రంజితమే .. రంజితమే' అంటూ ఈ పాట సాగుతోంది. జోరుగా హుషారుగా సాగే ఈ బీట్ కి విజయ్ ఒక రేంజ్ లో స్టెప్స్ వేశాడనే విషయం ప్రోమో చూస్తేనే అర్థమవుతోంది. గతంలో విజయ్ 'బీస్ట్'లో జానీ మాస్టర్ కంపోజ్ చేసిన 'అరబిక్ కుతు' డాన్స్ ఏ స్థాయిలో జనాల్లోకి దూసుకెళ్లిందో తెలిసిందే. 

 అందువల్లనే 'వరిసు' సినిమాలోని ఈ పాటకు జానీ మాస్టర్ కే విజయ్ ఛాన్స్ ఇచ్చాడు. ఆయన నమ్మకాన్ని జానీ మాస్టర్ మరింత పెంచాడనే అనిపిస్తోంది. పూర్తి సాంగును రేపు రిలీజ్ చేస్తున్నట్టుగా చెప్పారు. ఈ సినిమాలో విజయ్ జోడీగా రష్మిక అలరించనుంది. ఇతర ముఖ్యమైన పాత్రల్లో ప్రకాశ్ రాజ్ .. ప్రభు .. శరత్ కుమార్ .. శ్రీకాంత్ .. స్నేహ కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు.

More Telugu News