Andhra Pradesh: జగన్ అక్రమాస్తుల కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్యకు సుప్రీంకోర్టు నోటీసులు

  • జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడి ఉన్న బీపీ ఆచార్య
  • ఉమ్మడి ఏపీలో పరిశ్రమల శాఖ కార్యదర్శిగా పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్
  • అఖిల భారత సర్వీసు అధికారులను ప్రభుత్వ అనుమతితోనే విచారించాలంటూ గతంలో వాదన
  • అలాంటి అనుమతేమీ అవసరం లేదంటూ తాజాగా ఈడీ పిటిషన్
  • ఈ విషయంపై 3 వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆచార్యకు సుప్రీం ఆదేశం
supreme coirt issues notices to retired ias officer bp acharya in jagan disproportionate assets case

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గురువారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో జగన్ తో పాటు సహ నిందితుడిగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్యకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సీఆర్పీసీ 197 సెక్షన్ ప్రకారం ప్రభుత్వ కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఉద్యోగులను దర్యాప్తు సంస్థలు విచారించేందుకు ప్రభుత్వ అనుమతి అవసరమా? లేదా? అన్న విషయంపై అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు బీపీ ఆచార్యకు నోటీసులు జారీ చేసింది.

జగన్ అక్రమాస్తులు కూడబెట్టారంటూ దాఖలైన పిటిషన్ ను విచారించిన నాటి ఉమ్మడి హైకోర్టు విచారణకు సీబీఐకి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అప్పటి ఏపీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్యను కూడా సీబీఐతో పాటు ఈడీ కూడా నిందితుల జాబితాలో చేర్చింది. ప్రభుత్వ సర్వీసులో ఉన్న అధికారులను విచారించేందుకు ఎలాంటి అనుమతి లేదని ఈడీ కోర్టుకు తెలిపింది. అయితే ప్రభుత్వ అనుమతి లేకుండా అఖిల భారత సర్వీసు అధికారులను విచారించడానికి అనుమతి లేదని నాడు బీపీ ఆచార్య సహా పలువురు నిందితులు తెలిపారు. ఈ వ్యవహారంపైనే 3 వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు బీపీ ఆచార్యకు ఆదేశాలు జారీ చేసింది.

More Telugu News