Pakistan: సఫారీలపై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్... 43 పరుగులకే 4 వికెట్లు డౌన్

  • సిడ్నీలో పాకిస్థాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా
  • విజృంభించిన సఫారీ పేసర్లు
  • పాక్ టాపార్డర్ విలవిల
  • కాసేపు మెరిసిన మహ్మద్ హరీస్
Pakistan lose four wickets

ఆస్ట్రేలియాలో జరగుతున్న టీ20 వరల్డ్ కప్ లో నేడు పాకిస్థాన్, దక్షిణాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. సిడ్నీ ఆతిథ్యమిస్తున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే 43 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 

ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ (4) స్వల్ప స్కోరుకే వెనుదిరగ్గా, వన్ డౌన్ లో వచ్చిన మహ్మద్ హరీస్ దూకుడుగా ఆడి పాక్ శిబిరంలో ఉత్సాహం కలిగించాడు. హరీస్ 11 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 28 పరుగులు చేశాడు. అయితే అతడిని ఆన్రిచ్ నోక్యా అవుట్ చేయడంతో పాక్ రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కొద్దిసేపటికే కెప్టెన్ బాబర్ అజామ్ (6), షాన్ మసూద్ (2) పెవిలియన్ చేరారు. సఫారీ బౌలర్లలో నోక్యా 2, పార్నెల్ 1, ఎంగిడి 1 వికెట్ తీశారు. 

ప్రస్తుతం పాక్ స్కోరు 9 ఓవర్లలో 4 వికెట్లకు 55 పరుగులు. ఇఫ్తికార్ అహ్మద్ 7, మహ్మద్ నవాజ్ 7 పరుగులతో ఆడుతున్నారు.

More Telugu News