T20 World Cup: టీ20 ప్రపంచ కప్​.. జింబాబ్వే కు షాకిచ్చిన చిన్న జట్టు నెదర్లాండ్స్​

  • సూపర్ 12 రౌండ్ లో తొలి విజయం సాధించిన డచ్ జట్టు
  • అర్ధ సెంచరీతో సత్తా చాటిన ఒడౌడ్
  • గ్రూప్2 లో ప్రతి జట్టుకు ఒక్కో విజయం
Netherlands complete a special win over zimbabwe

టీ20 ప్రపంచ కప్ సూపర్12 రౌండ్ లో చిన్న జట్టు నెదర్లాండ్స్ తొలి విజయం సొంతం చేసుకుంది. తమ కంటే బలమైన జింబాబ్వేకు షాకిచ్చింది. వరుసగా మూడు ఓటముల తర్వాత బుధవారం ఉదయం అడిలైడ్ స్టేడియంలో జరిగిన గ్రూప్–2 మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 19.2 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌటైంది. స్టార్ ప్లేయర్ సికందర్ రజా (40), సీన్ విలియమ్స్ (28) సత్తా చాటారు. ఈ ఇద్దరు తప్ప మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు. ఓపెనర్లు వెస్లీ మెదెవెరె (1), క్రెయిగ్ ఎర్విన్ (3)తో పాటు చకబ్వా (5), మిల్టన్ షుంబా (2), ర్యాన్ బర్ల్ (2) నిరాశ పరిచారు. 

నెదర్లాండ్స్ బౌలర్లలో మీకెరన్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. బ్రెంటన్ గ్రోవర్, లొగాన్ బీక్, డి లీడె రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం మ్యాక్స్ ఒడౌడ్ (52) అర్ధ సెంచరీకి తోడు టామ్ కూపర్(32) రాణించడంతో నెద్లర్లాండ్స్ 18 ఓవర్లలో 120/5 స్కోరు చేసి గెలిచింది. మ్యాక్ ఒడౌడ్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. నాలుగు మ్యాచ్ లలో ఒక విజయంతో నెదర్లాండ్స్ రెండు పాయింట్లతో చివరి స్థానంలో నిలింది. పాకిస్థాన్ ను ఓడించి సంచలనం సృష్టించిన జింబాబ్వే మూడు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. గ్రూప్2 లో ప్రతి జట్టూ ఇప్పుడు ఒక్కో విజయం సాధించింది.

More Telugu News