Aaron Finch: కెప్టెన్ ఫించ్ అర్ధసెంచరీ... ఐర్లాండ్ పై ఆస్ట్రేలియా భారీ స్కోరు

  • టీ20 వరల్డ్ కప్ లో ఆసీస్ వర్సెస్ ఐర్లాండ్ 
  • బ్రిస్బేన్ లో జరుగుతున్న మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఐర్లాండ్
  • 20 ఓవర్లలో 5 వికెట్లకు ఆసీస్ 179 పరుగులు 
Aussies posts huge total against Ireland with captain Finch fifty

టీ20 వరల్డ్ కప్ లో నేడు ఆస్ట్రేలియా, ఐర్లాండ్ తలపడుతున్నాయి. ఈ సూపర్-12 గ్రూప్-1 మ్యాచ్ కు బ్రిస్బేన్ లోని గబ్బా మైదానం వేదికగా నిలుస్తోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఐర్లాండ్ బౌలింగ్ ఎంచుకోగా, ఆస్ట్రేలియా బ్యాటింగ్ కు దిగింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ దూకుడుగా ఆడి అర్ధసెంచరీ నమోదు చేయగా, ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 179 పరుగులు చేసింది. 

విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ కేవలం 3 పరుగులకే అవుట్ కాగా, మిచెల్ మార్ష్ తో కలిసి ఫించ్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. ఫించ్ 44 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో 63 పరుగులు చేశాడు. మార్ష్ 22 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు, 2 సిక్సులతో 28 పరుగులు సాధించాడు. 

మ్యాక్స్ వెల్ (13) నిరాశపర్చినా, మార్కస్ స్టొయినిస్ మరోసారి తనదైనశైలిలో ఆడి 25 బంతుల్లోనే 35 పరుగులు చేశాడు. టిమ్ డేవిడ్ 15, మాథ్యూ వేడ్ 7 పరుగులతోనూ నాటౌట్ గా నిలిచారు. ఐర్లాండ్ బౌలర్లలో బ్యారీ మెక్ కార్తీ 3, జోష్ లిటిల్ 2 వికెట్లు తీశారు.

More Telugu News