TDP: ప్రొద్దటూరు టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్ తిరస్కరణ

  • పొదుపు మహిళలను మోసగించిన మహిళకు రక్షణ కల్పించారని ప్రవీణ్ పై ఆరోపణలు
  • ప్రవీణ్ కుమార్ ఇంటిపై దాడి చేసిన వైసీపీ మహిళా నేతలు
  • 2 వారాల క్రితం టీడీపీ నేతను అరెస్ట్ చేసిన పోలీసులు
  • ప్రవీణ్ బెయిల్ పిటిషన్ ను కొట్టివేసిన ప్రొద్దటూరు కోర్టు
proddatur court dismisses tdpleader praveen kumar reddy bail petition

కడప జిల్లా ప్రొద్దటూరుకు చెందిన టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను స్థానిక కోర్టు కొట్టివేసింది. పొదుపు మహిళల సొమ్ము కాజేసిందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళకు రక్షణ కల్పించారని ప్రవీణ్ కుమార్ రెడ్డిపై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో వైసీపీకి చెందిన మహిళలు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు. ఆ తర్వాత మహిళల ఫిర్యాదుతో 2 వారాల క్రితం పోలీసులు ప్రవీణ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ అగ్ర నేత నారా లోకేశ్ స్వయంగా కడపకు వెళ్లి జైలులో ఉన్న ప్రవీణ్ కుమార్ రెడ్డిని పరామర్శించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తనకు బెయిల్ ఇవ్వాలంటూ ప్రవీణ్ కుమార్ రెడ్డి స్థానిక ప్రొద్దటూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సోమవారం విచారణ చేపట్టిన కోర్టు.... బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ప్రవీణ్ బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది.

More Telugu News