Twitter: తొలగించిన ఉద్యోగులకు ఇచ్చే పరిహారానికి మస్క్ మోకాలడ్డు?

  • పరిహారం నిలిపివేసే యోచనలో ఉన్నట్టు వార్తలు
  • ఉద్వాసన పలికిన వారికి  ఒప్పందం ప్రకారం చెల్లించాల్సింది రూ. 1600 కోట్ల పైనే 
  • సీఈవో పరాగ్ అగర్వాల్ కే రూ. 344 కోట్లు ఇవ్వాల్సిన వైనం
After firing top execs Elon Musk could block payout to Twitter employees

ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్ ఫారమ్ ట్విట్టర్‌ని హస్తగతం చేసుకున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. సుదీర్ఘ చర్చలు, వివాదాలు, న్యాయ ప్రక్రియ తర్వాత 44 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని పూర్తి చేశారు. అయితే,  ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకున్న వెంటనే ఆయన నిర్ణయాలు చర్చనీయాంశమయ్యాయి.

ఈ క్రమంలో యజమానిగా సంస్థ ప్రధాన కార్యాలయంలోకి అడుగు పెట్టిన తొలిరోజే పలువురు కీలక ఉద్యోగులకు ఉద్వాసన పలికారు. ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పరాగ్ అగర్వాల్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగల్, చీఫ్ లీగల్ ఆఫీసర్ విజయ గద్దెలను తొలగిస్తూ మొదటి నిర్ణయం తీసుకున్నారు. అయితే, వీరిని సంస్థ నుంచి తొలగించడంతో పరిహారంగా వారికి ట్విట్టర్ తరఫున మస్క్ 200 మిలియన్ డాలర్ల (సుమారు రూ.1600 కోట్లు) కంటే ఎక్కువ చెల్లించవలసి ఉంటుంది. 

ఇందులో అగర్వాల్ అధిక మొత్తం పరిహారం అందుకోనున్నారు. గతేడాది నవంబర్ లో పరాగ్ ట్విట్టర్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించినప్పుడే పరిహారాన్ని ఖరారు చేశారు. ఎందుకంటే ఆయన 'గోల్డెన్ పారాచూట్' నిబంధనతో ఒప్పందంపై సంతకం చేశారు. ట్విటర్‌తో ఒప్పందంలో భాగంగా ఏడాదికంటే ముందే ఉద్యోగం నుంచి తొలగిస్తే ఆయనకు దాదాపు 42 మిలియన్ల (సుమారు రూ. 344 కోట్లు) పరిహారం ఇవ్వాలి. అయితే, టాప్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించిన తర్వాత మస్క్ వారికి పరిహారం చెల్లించకుండా నిరోధించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే ఉద్వాసనకు గురైన ఉద్యోగులు మస్క్ పై న్యాయ పోరాడానికి దిగే ఆస్కారం ఉంటుంది.

More Telugu News