CM Jagan: థర్మల్ ప్లాంట్ కోసం భూములిచ్చిన రైతులకు శిరసు వంచి నమస్కరిస్తున్నా: సీఎం జగన్

  • నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన
  • నేలటూరులో ఏపీ జెన్ కో మూడో ప్లాంట్ కు ప్రారంభోత్సవం
  • విద్యుదుత్పత్తి రంగంలో మరో ముందడుగు అని సీఎం వెల్లడి
CM Jagan inaugurates AP Gen Co third plant in Nelaturu

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులో నెలకొల్పిన ఏపీ జెన్ కో మూడో ప్లాంట్ ను సీఎం జగన్ నేడు ప్రారంభించారు. ఓ బటన్ నొక్కి యూనిట్ ను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి రంగంలో నేడు మరో ముందడుగు పడిందని తెలిపారు. అత్యాధునిక సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో ఏపీ జెన్ కో స్వయంగా నిర్మించిన దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలోని 800 మెగావాట్ల ప్లాంట్ ను నేడు జాతికి అంకితం చేస్తున్నామని వివరించారు. 

నాడు 2008లో ఇక్కడ థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారని, రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రి అయిన దామోదరం సంజీవయ్య పేరును ఈ థర్మల్ స్టేషన్ కు పెట్టుకున్నామని సీఎం జగన్ వెల్లడించారు. 

దేశంలో ప్రభుత్వ రంగంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మితమైన తొలి థర్మల్ విద్యుత్ కేంద్రం ఇదేనని తెలిపారు. కాగా, ఈ థర్మల్ ప్లాంట్ కోసం, కృష్ణపట్నం పోర్టు కోసం భూములు ఇచ్చిన రైతులకు నిండు మనసుతో శిరసు వంచి నమస్కరిస్తున్నానని సీఎం జగన్ పేర్కొన్నారు.

More Telugu News