Telangana: బీజేపీకి రాజీనామా చేసిన రాపోలు ఆనంద భాస్కర్... జేపీ నడ్డాకు రాజీనామా లేఖ పంపిన నేత

  • కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యత్వం దక్కించుకున్న రాపోలు
  • ఎంపీ పదవీ కాలం ముగిశాక బీజేపీలో చేరిన వైనం
  • ఇటీవలే సీఎం కేసీఆర్ తో భేటీ అయిన మాజీ ఎంపీ
  • చేనేత కార్మికుల సంక్షేమానికి బీజేపీ తూట్లు పొడుస్తోందని ఆరోపణలు
ex mp Ananda Bhaskar Rapolu resigns bjp

రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన తన రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపారు. బీజేపీ నుంచి వైదొలగుతున్నట్లు ఆయన తన లేఖలో వెల్లడించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ లో ఉద్యోగిగా పనిచేసి ఆ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యత్వాన్ని దక్కించుకున్న రాపోలు...తన రాజ్యసభ సభ్యత్వం ముగిసిన తర్వాత బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.

ఇటీవలే టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ను ప్రగతి భవన్ లో కలిసిన రాపోలు... బీజేపీ విధానాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చేనేత కార్మికుల సంక్షేమానికి బీజేపీ సర్కారు తూట్లు పొడుస్తోందని ఆరోపించిన ఆయన... టీఆర్ఎస్ సర్కారు మాత్రం చేనేత కార్మికులకు అండగా నిలుస్తోందని తెలిపారు. 

More Telugu News