Virat Kohli: విరాట్ కోహ్లీని 'ఏలియన్' గా అభివర్ణించిన పాక్ దిగ్గజం

  • మెల్బోర్న్ లో కోహ్లీ విశ్వరూపం
  • కోహ్లీని అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడని పేర్కొన్న అక్రమ్
  • మరో గ్రహం నుంచి వచ్చినట్టు అనిపించిందని కితాబు
  •  కోహ్లీ ఛేజింగ్ లో మొనగాడని వెల్లడి
Pakistan legend Wasim Akram terms Virat Kohli an alien

పాకిస్థాన్ తో వరల్డ్ కప్ మ్యాచ్ లో క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తన కెరీర్ లోనే అత్యుత్తమం అనదగ్గ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చిన కోహ్లీ... టీమిండియా విజయంలో ప్రధాన భూమిక పోషించాడు. దీనిపై పాకిస్థాన్ పేస్ బౌలింగ్ దిగ్గజం వసీం అక్రమ్ స్పందించారు. 

మెల్బోర్న్ లో కోహ్లీ ఆటతీరు చూస్తే ఓ ఏలియన్ (గ్రహాంతరజీవి)లా అనిపించాడని పేర్కొన్నారు. మనుషుల మధ్యలో ఏలియన్స్ కూడా ఉంటారు అనిపించేలా కోహ్లీ బ్యాటింగ్ కొనసాగిందని అక్రమ్ వివరించారు. ఆధునికతరం క్రికెటర్లలో తాను చూసిన అత్యుత్తమ ఆటగాళ్లలో కోహ్లీ ఒకడని కొనియాడారు. ఛేజింగ్ లో కోహ్లీని కొట్టే మొనగాడు లేడని, గత 15 ఏళ్లుగా అతడి బ్యాటింగ్ సగటే నిదర్శనమని అక్రమ్ వెల్లడించారు. 

160 పరుగుల లక్ష్యఛేదనలో భారత్ 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోగా, హార్దిక్ పాండ్యా (40)తో కలిసి కోహ్లీ అసాధారణ ఆటతీరుతో మ్యాచ్ ను భారత్ వైపు తిప్పేశాడు. కోహ్లీ 53 బంతుల్లోనే 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

More Telugu News