ISRO: వచ్చే ఏడాది జూన్ లో చంద్రయాన్-3: ఇస్రో చైర్మన్

  • ప్రయోగానికి అంతా సిద్ధమైందని సోమ్ నాథ్ ప్రకటన
  • రాకెట్ కు తుదిమెరుగులు దిద్దుతున్నట్లు వెల్లడి
  • జీఎస్ఎల్వీ మార్క్ 3 విజయవంతంపై హర్షం
Chandrayan 3 mission likely to be launched in June next year

చంద్రయాన్ -3 ప్రయోగానికి దాదాపు అంతా సిద్ధమైందని ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమ్ నాథ్ వెల్లడించారు. వచ్చే ఏడాది జూన్ లో రాకెట్ ప్రయోగానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తుది ఏర్పాట్లలో భాగంగా చిన్నచిన్న పరీక్షలు చేయాల్సి ఉందని ఆయన వివరించారు. వచ్చే ఏడాదిలో ఫిబ్రవరితో పాటు జూన్ లో రాకెట్ ప్రయోగానికి స్లాట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జూన్ లోనే చంద్రయాన్-3 ప్రయోగం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. జీఎస్ఎల్వీ మార్క్ 3 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇస్రో చైర్మన్ మాట్లాడారు.

చంద్రయాన్-2 తో పోలిస్తే చంద్రయాన్-3 మిషన్ ను మరింత అత్యాధునికంగా తీర్చిదిద్దినట్లు వివరించారు. 2019లో చేపట్టిన చంద్రయాన్-2 మిషన్ చివరి క్షణంలో ఫెయిల్ అయింది. చంద్రుడిపైన దిగే సమయంలో ల్యాండర్ తో సంబంధాలు తెగిపోయిన విషయం తెలిసిందే. ఈ ఫెయిల్యూర్ నేర్పిన పాఠాలతో చంద్రయాన్-3 మిషన్ ను తీర్చిదిద్దినట్లు సోమ్ నాథ్ తెలిపారు. శనివారం ప్రయోగించిన జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ విజయవంతంగా 36 ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టిందని సోమ్ నాథ్ వివరించారు.

More Telugu News