Chicken: పొరుగింటి దంపతుల మధ్య చికెన్ వివాదంలో తలదూర్చి ప్రాణాలు పోగొట్టుకున్న వ్యక్తి

  • చికెన్ వండాలన్న భర్త
  • నిరాకరించిన భార్య
  • ఇరువురి మధ్య ఘర్షణ
  • జోక్యం చేసుకున్న ఇరుగుపొరుగు వారు
  • కర్రతో దాడికి దిగిన భర్త
Man died after intervene chicken dispute between couple

మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. పక్కింటి దంపతుల వివాదంలో తలదూర్చి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఛవాని పత్తర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. అసలేం జరిగిందంటే... పప్పు అహిర్వార్ అనే వ్యక్తి తన భార్య చికెన్ వండేందుకు నిరాకరించడంతో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. దాంతో సహనం కోల్పోయిన పప్పు అహిర్వార్ భార్యను కొట్టడం ప్రారంభించాడు. 

ఈ గొడవకు ఇరుగుపొరుగువారు అక్కడ గుమికూడారు. వారిలో బాబు అహిర్వార్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. బాబు సహా ఇతరులు ఆ భార్యాభర్తలకు సర్దిచెప్పారు. విషయం అంతటితో సద్దుమణిగిందని అందరూ భావించారు. 

కానీ పప్పు అహిర్వార్... బాబు అహిర్వార్ పై కోపం పెంచుకున్నాడు. బాబు అహిర్వార్ ఇంటికి వెళ్లి కర్రతో దాడి చేశాడు. ఈ ఘటనలో బాబు అహిర్వార్ కు తీవ్రగాయాలయ్యాయి. అతడిని స్థానికులు హమీదియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మరణించాడని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పప్పు అహిర్వార్ ను అరెస్ట్ చేశారు.

More Telugu News