Raghunandan Rao: ఎనిమిది మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వస్తున్నారు: రఘునందన్ రావు

  • ఢిల్లీలో కాంగ్రెస్ నేతలతో కేసీఆర్ చర్చలు జరిపారన్న రఘునందన్ 
  • తనపై దుష్ప్రచారం చేసిన వారిపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరిక 
  • బీజేపీలోకి టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున చేరబోతున్నారు
TRS MLAs are joining BJP says Raghunandan Rao

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శలు గుప్పించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు హైదరాబాద్ లో మూలాలు ఉన్నాయని ఆయన అన్నారు. అందుకే ఇక్కడ సోదాలు జరుగుతున్నాయని చెప్పారు. కేసీఆర్ ఢిల్లీకి వెళ్లినప్పుడు కాంగ్రెస్ నేతలతో చర్చలు జరిపినట్టు తన వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల పైన బురద చల్లే కార్యక్రమం చేస్తున్నారని మండిపడ్డారు. 

తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వాళ్లపై పరువునష్టం దావా వేస్తానని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలోకి పెద్ద ఎత్తున వలసలు ఉండబోతున్నాయని చెప్పారు. రంగారెడ్డి, కరీంనగర్, నల్గొండ, వరంగల్ జిల్లాల నుంచి ఇద్దరు చొప్పున టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి రాబోతున్నారని తెలిపారు. మునుగోడు ఎన్నికల తర్వాత ఈ చేరికలు ఉంటాయని అన్నారు.

More Telugu News