ISRO: మరో భారీ ప్రయోగానికి ఇస్రో సిద్ధం.. జీఎస్ఎల్వీ మార్క్3 ప్రయోగానికి ఈ అర్ధరాత్రి ప్రారంభం కానున్న కౌంట్ డౌన్

  • జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ ను ప్రయోగించనున్న ఇస్రో
  • రేపు అర్ధరాత్రి 12.07 గంటలకు నింగిలోకి ఎగరనున్న రాకెట్
  • 36 ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లనున్న జీఎస్ఎల్వీ
GSLV MK 3 count down starts tonight

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో భారీ ప్రయోగానికి సిద్ధమవుతోంది. సూళ్లూరుపేటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ ను ప్రయోగించనుంది. రేపు అర్ధరాత్రి 12.07 గంటలకు రాకెట్ నింగిలోకి ఎగరనుంది.

ఈ క్రమంలో ఈ అర్ధరాత్రి 12.07 గంటలకు కౌంట్ డాన్ ప్రారంభం అవుతుంది. 24 గంటల పాటు కౌంట్ డౌన్ కొనసాగనుంది. 5,200 కిలోల బరువు కలిగిన యూకేకు చెందిన 36 ఉపగ్రహాలను ఈ రాకెట్ నింగిలోకి తీసుకెళ్లనుంది. ఈ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేవపెట్టిన వెంటనే యూకేకు చెందిన గ్రౌండ్ సిబ్బంది వాటిని తమ అధీనంలోకి తీసుకుంటారు. మరోవైపు చంద్రయాన్ -3 ప్రయోగం వచ్చే ఏడాది జూన్ లో ఉంటుందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ నిన్న ప్రకటించారు.

More Telugu News