Telangana: యాదాద్రికి 'గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్' అవార్డు.. హర్షం వ్యక్తం చేసిన కేసీఆర్

  • 2022- 25 సంత్సరాలకు గానూ ఆలయానికి అవార్డు
  • అవార్డు ప్రకటించిన ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్
  • భారత దేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వానికి దక్కిన గౌరవమన్న కేసీఆర్
yadadri temple got green place of worship award

తెలంగాణలోని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ (ఆధ్యాత్మిక హరిత పుణ్యక్షేత్రం) అవార్డుకు ఎంపికైంది. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ గురువారం యాదాద్రి ఆలయానికి ఈ అవార్డును ప్రకటించింది. 2022- 25 సంవత్సరాలకు గానూ యాదాద్రికి ఆ సంస్థ ఈ అవార్డును ప్రకటించింది. యాదాద్రికి ఈ అవార్డు రావడం పట్ల సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి కేటీఆర్ హర్షం ప్రకటించారు. 


తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన యాదాద్రికి ఈ అవార్డు రావడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. స్వయం పాలనలో తెలంగాణ ఆలయాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవార్డులు దక్కడం భారత దేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వానికి దక్కిన గౌరవమని ఆయన అన్నారు.

More Telugu News