Amaravati: అమరావతిలో ఇతర ప్రాంత పేదలకు కూడా ఇళ్ల స్థలాలు.. ఆమోదముద్ర వేసిన గవర్నర్ బిశ్వభూషణ్

  • అసెంబ్లీ సమావేశాల్లో చట్టానికి సవరణలు చేసిన వైసీపీ ప్రభుత్వం
  • చట్ట సవరణలకు ఆమోదముద్ర వేసిన రాష్ట్ర గవర్నర్
  • మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేసేందుకు అవకాశం
AP Gov Biswabhusan Harichandan gives green signal to allocate Amaravati lands to other places poor also

ఏపీ రాజధాని అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేశారు. పేదలకు స్థలాలు ఇచ్చే సీఆర్డీయే, ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ చట్టాల సవరణలకు గవర్నర్ ఆమోదముద్ర వేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ చట్టాలకు వైసీపీ ప్రభుత్వం సవరణలు చేసింది. 

ఇప్పుడు గవర్నర్ కూడా ఆమోదముద్ర వేయడంతో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుకు మార్గం సుగమం అయింది. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించేలా చట్ట సవరణను చేశారు. అమరావతి ప్రాంతంలోని వారికే కాకుండా... ఇతర ప్రాంతాల వారికి కూడా ఇక్కడ ఇళ్ల స్థలాలను ఇచ్చేలా చట్టాన్ని సవరించారు. మాస్టర్ ప్లాన్ లో మార్పులు, చేర్పులు చేసేలా అవకాశాన్ని కల్పించారు.

More Telugu News