New Delhi: ఢిల్లీలో బాణసంచా కొన్నా, కాల్చినా రూ.200 జరిమానా... 6 నెలల జైలు శిక్ష కూడా

  • బాణసంచాపై నిషేధం విధించిన ఢిల్లీ సర్కారు
  • విక్రయాలు, వినియోగంపై నిషేధం
  • జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదని హెచ్చరిక
Delhi government bans fire crackers

దీపావళి పర్వదినాన... బాణసంచా సంబరాలు లేకుండానే ఢిల్లీ వాసులు పండుగను జరుపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే... బాణసంచాను ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ నిషేధ ఉత్తర్వుల ప్రకారం ఢిల్లీ పరిధిలో బాణసంచా కొనుగోలు చేసినా, కాల్చినా కూడా రూ.200 జరిమానా విధిస్తారు. అంతేకాకుండా 6 నెలల పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశాలున్నాయి.

More Telugu News