Allu Arjun: 'పుష్ప 2'కి హైలైట్ గా .. సింహంతో బన్నీ ఫైట్!

  • సంచలన విజయాన్ని సాధించిన 'పుష్ప'
  • ఆ సినిమా సీక్వెల్ దిశగా జరుగుతున్న సన్నాహాలు 
  • థాయ్ ల్యాండ్ ఫారెస్టులో యాక్షన్ సీన్ కి ప్లాన్ 
  • త్వరలోనే పట్టాలెక్కుతున్న ప్రాజెక్టు    
Pushpa 2 movie update

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ రూపొందించిన 'పుష్ప' సినిమా, పాన్ ఇండియా స్థాయిలో తన సత్తా చాటుకుంది. హిందీ వెర్షన్ 100 కోట్లకి పైగా రాబట్టడం విశేషం. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ గా 'పుష్ప 2' నిర్మితమవుతోంది. 350 కోట్లకి పైగా బడ్జెట్ ను ఈ సినిమా కోసం కేటాయించారు. మరికొన్ని కొత్త పాత్రలను క్రియేట్ చేసి, వివిధ భాషల నుంచి ఆర్టిస్టులను తీసుకుంటున్నారు. 

 'పుష్ప' సినిమాలో అడవి నేపథ్యంలోని జంతువులను .. పాములను చూపించకపోవడం ఒక లోపంగా చెప్పుకున్నారు. కానీ ఈ సారి ఆ లోపాన్ని కూడా భర్తీ చేయనున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ సారి అడవిలో హీరో ఒక సింహంతో తలపడనున్నాడని అంటున్నారు. థాయ్ ల్యాండ్ ఫారెస్టులో ఈ సన్నివేశాన్ని ఒక రేంజ్ లో చిత్రీకరించడానికి రెడీ అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. 

'ఆర్ ఆర్ ఆర్' సినిమాలో ఎన్టీఆర్ తన ఇంట్రడక్షన్ సీన్లోనే పులితో తలపడతాడు. ఆ సీన్ ఆ కథను ఒక్కసారిగా నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళుతుంది. ఆ స్థాయిలో సింహంతో బన్నీ తలపడే సీన్ ఉంటుందని చెబుతున్నారు. విజయ్ సేతుపతి .. అర్జున్ కపూర్ కూడా ఈ సినిమాలో జాయిన్ కానున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా పాటల పనిలోనే దేవిశ్రీ ఉన్నట్టుగా సమాచారం.

More Telugu News