Delhi Liquor Scam: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సీబీఐ సమన్లు

  • ఢిల్లీ లిక్కర్ స్కాంపై సీబీఐ, ఈడీ కేసులు
  • ఇప్పటికే పలువురిని విచారించిన సీబీఐ
  • సోమవారం విచారణకు రావాలంటూ సిసోడియాకు తాజాగా సీబీఐ సమన్లు
cbi summons delhi deputy cm manish sisodia

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు శుక్రవారం భారీ షాక్ తగిలింది. ఈ కేసులో తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ మనీశ్ సిసోడియాకు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ నోటీసులు జారీ చేసింది. సోమవారం ఉదయం 11 గంటలకు తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో సీబీఐ అధికారులు సిసోడియాకు ఆదేశాలు జారీ చేశారు. 

ఇప్పటికే ఈ ఆరోపణలపై సీబీఐతో పాటు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలకంగా వ్యవహరించారని భావిస్తున్న పలువురు వ్యక్తులను ఇప్పటికే దర్యాప్తు సంస్థలు విచారించాయి. ఇందులో భాగంగా తెలంగాణకు చెందిన అభిషేక్ రావును సీబీఐ అధికారులు ఏకంగా 5 రోజుల పాటు విచారించారు. ఈ విచారణ ముగిసిన మరునాడే సిసోడియాకు సీబీఐ అధికారులు సమన్లు జారీ చేయడం గమనార్హం.

More Telugu News