Shashi Tharoor: అశోక్ గెహ్లాట్ పై చర్యలు తీసుకోవాలి: శశిథరూర్

  • కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ఖర్గే, థరూర్
  • ఖర్గేకు మద్దతుగా ట్విట్టర్ లో వీడియో ఉంచిన గెహ్లాట్
  • అసంతృప్తిని వ్యక్తం చేసిన శశి థరూర్
Shashi Tharoor demands action against Ashok Gehlot

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక గెహ్లాట్ పై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం శశిథరూర్, మల్లికార్జున ఖర్గే పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఖర్గేకు అనుకూలంగా ట్విట్టర్ లో కోహ్లీ ఓ వీడియో సందేశాన్ని ఉంచారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో ఖర్గే మంచి సంబంధాలను కలిగి ఉన్నారని వీడియోలో గెహ్లాట్ అన్నారు. ప్రతిపక్ష నేతలతో కూడా చర్చించగలిగే సామర్థ్యం ఖర్గేకు ఉందని చెప్పారు. కాబట్టి ఆయనను మనందరం గెలిపించాలని అన్నారు. 

ఈ నేపథ్యంలో శశిథరూర్ మాట్లాడుతూ అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని... పార్టీ ఆఫీస్ బేరర్లు కానీ, ముఖ్యమంత్రులు కానీ, పీసీసీ చీఫ్ లు కానీ ఏ అభ్యర్థి తరపున ప్రచారంలో పాల్గొనడం కానీ, మద్దతును ప్రకటించడం కానీ చేయకూడదని అన్నారు. కానీ ఖర్గేకు అశోక్ గెహ్లాట్ బహిరంగంగా మద్దతును తెలిపారని... దీనిపై కాంగ్రెస్ ఎన్నికల అధికార యంత్రాంగం దర్యాప్తు చేయాలని కోరారు. గెహ్లాట్ పై చర్యలు తీసుకోవాలని అన్నారు.

More Telugu News