3 wives: భార్యలు ఎంత మంది ఉన్నా గౌరవిస్తాం.. మరి హిందువులు?: యూపీ ఎంఐఎం నేత వివాదాస్పద వ్యాఖ్యలు

  • ఇద్దరు భార్యలున్నా సమాజంలో సుముచిత స్థానం కల్పిస్తామన్న షౌకత్ అలీ
  • పిల్లలు అందరి పేర్లు రేషన్ కార్డులో చేరుస్తామని వెల్లడి
  • హిందువులు ఒక్కరికీ గౌరవం ఇవ్వరని విమర్శ 
We have 3 wives and respect each but Hindus AIMIM leader remark sparks row

భార్యల విషయంలో రెండు సామాజిక వర్గాల మధ్య వైరుద్ధ్యంపై ఎంఐఎం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు షౌకత్ అలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘మేము మూడు పెళ్లిళ్లు చేసుకుంటామని కొందరు మాట్లాడుతున్నారు. కనీసం మేము రెండు వివాహాలు చేసుకున్నా, సమాజంలో ఇద్దరు భార్యలకు సముచిత గౌరవం కల్పిస్తాం. కానీ మీరు (హిందువులు) ఒకర్ని పెళ్లి చేసుకుంటారు. ముగ్గురితో సహజీవనం (ప్రియురాళ్లు) చేస్తారు. మీరు అటు భార్యను కానీ, ఇటు ప్రియురాళ్లను కానీ గౌరవించరు. కానీ మేము అలా కాదు. రెండు పెళ్లిళ్లు చేసుకుంటే వారిని సమానంగా గౌరవిస్తాం. రేషన్ కార్డులో పిల్లల పేర్లు అన్నీ ఉంటాయి’’ అని షౌకత్ అలీ వ్యాఖ్యానించారు. 

హిజాబ్ అంశంపై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం రెండు వేర్వేరు తీర్పులు ఇవ్వడంపైనా షౌకత్ అలీ మాట్లాడారు. 'ఈ దేశంలో ఎవరు ఏది ధరించాలో హిందుత్వ కాదు నిర్ణయించాల్సింది. రాజ్యాంగం ఆ పని చేయాలి. ఈ తరహా అంశాలను లేవనెత్తడం ద్వారా బీజేపీ దేశాన్ని విభజించాలని చూస్తోంది’’అని షౌకత్ అలీ అన్నారు. 

More Telugu News