Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు సరిగా పాలించి ఉంటే చిత్తుగా ఎందుకు ఓడిపోతారు?: సజ్జల

  • బాపట్ల జిల్లా చుండూరులో అభివృద్ధి పనులను ప్రారంభించిన సజ్జల
  • పవన్, బీజేపీలకు బాబు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శ
  • సామాన్యులకు రాష్ట్ర సచివాలయంతో పనేంటని ప్రశ్న
If Chandra babu Ruled Well why he defeated in 2019 Elections questions Sajjala

చంద్రబాబునాయుడు కనుక గతంలో సరిగ్గా పాలించి ఉంటే 2019 ఎన్నికల్లో ప్రజలు ఆయనను చిత్తుగా ఎందుకు ఓడించి ఉండేవారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం వలివేరులో అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఎన్నికలు దగ్గర పడుతుండడంతో దత్తపుత్రుడు పవన్ కల్యాణ్, బీజేపీలకు దగ్గరయ్యేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అన్నారు. గ్రామస్థాయిలో సచివాలయాలు ఏర్పాటు చేసిన తర్వాత సమస్యలు స్థానికంగానే పరిష్కారమవుతున్నాయని, సామాన్యులకు ఇక రాష్ట్ర సచివాలయంతో పనేంటని సజ్జల ప్రశ్నించారు. అందుకనే పరిపాలన రాజధానిని విశాఖకు మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. మంత్రి నాగార్జున మాట్లాడుతూ ఆరు నూరైనా మూడు ప్రాంతాల్లోనూ రాజధానులు ఏర్పాటు చేస్తామన్నారు.

More Telugu News