Kalyanram: కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం .. దాదాపుగా టైటిల్ ఇదేనట!

  • కల్యాణ్ రామ్ హీరోగా విభిన్న కథాచిత్రం 
  • పరిశీలనలో 'ఎమిగోస్' టైటిల్
  • కెరియర్ పరంగా ఇది ఆయనకి 19వ సినిమా 
  • త్వరలోనే పూర్తి కానున్న చివరి షెడ్యూల్
kalyanram new movie update

మొదటి నుంచి కూడా కల్యాణ్ రామ్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వెళుతున్నాడు. అలా ఈ సారి 'బింబిసార'తో ఆయన చేసిన ప్రయోగం ఫలించింది. హీరోగా .. నిర్మాతగా ఈ సినిమా ఆయనకి భారీ సక్సెస్ ను తెచ్చిపెట్టింది. దాంతో ఆయన ఈ సినిమాకి సీక్వెల్ చేయడానికి సిద్ధమవుతూనే, ఈ లోగా మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి రెడీ అవుతున్నాడు. 

కల్యాణ్ రామ్ కి కెరియర్ పరంగా ఇది 19వ సినిమా. మైత్రీ మూవీస్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఇటీవలే గోవా షెడ్యూల్ ను పూర్తిచేసిన టీమ్, చివరి షెడ్యూల్ షూటింగుకి సన్నాహాలు చేస్తున్నారు. రాజేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ మూడు పాత్రల మధ్య వేరియేషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అంటున్నారు. 

కల్యాణ్ రామ్ ఇలా మూడు పాత్రలను పోషించడం ఇదే మొదటిసారి. ఈ మూడు పాత్రలు కూడా దేనికదే ప్రత్యేకతను సంతరించుకుని ఆకట్టుకుంటాయని అంటున్నారు. కథాపరంగా ఈ సినిమాకి 'ఎమిగోస్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. దాదాపుగా ఇదే టైటిల్ ఖరారు కావొచ్చని చెబుతున్నారు. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది.

More Telugu News