K.Rosaiah: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య బంధువు హంతకులకు యావజ్జీవ కారాగార శిక్ష

  • పదేళ్ల క్రితం బెంగళూరులో హత్యకు గురైన మనోజ్ గ్రంధి
  • మిత్రులతో కలిసి మనోజ్‌ను హత్య చేసిన కారు డ్రైవర్
  • కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాల కోసమే హత్య
  •  నిందితుల నుంచి రూ. 2 కోట్ల విలువ చేసే నగలు స్వాధీనం
Life imprisonment to ex minster Rosaiah relative Manoj Grandhi Murder Case

పదేళ్ల క్రితం బెంగళూరులో జరిగిన మాజీ ముఖ్యమంత్రి కె.రోశయ్య బంధువు హత్య కేసులో తుది తీర్పు వెలువడింది. ముగ్గురు నిందితులకు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 6 ఫిబ్రవరి 2012న రోశయ్య బంధువు, హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్త మనోజ్‌ గ్రంధి (44) విమానంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు చేరుకున్నారు. అక్కడ ఓ కారును అద్దెకు తీసుకున్నారు. రవికుమార్ అనే వ్యక్తి కారును డ్రైవ్ చేశాడు. మనోజ్ కారులో పెట్టిన సంచుల్లో కోట్ల రూపాయల విలువ చేసే బంగారు నగలు ఉన్నట్టు రవికుమార్ గుర్తించాడు. విషయాన్ని కృష్ణగౌడ్, శివలింగయ్య అనే ఇద్దరు మిత్రులకు ఫోన్ చేసి చెప్పాడు. 

బళ్లారి రోడ్డులోని విండర్స్ మ్యానర్ వంతెన వద్ద కాపు కాసిన దుండగులు అక్కడ కారును అడ్డగించి మనోజ్‌కు కత్తులు చూపించి బెదిరించి, తాడుతో గొంతు బిగించి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని తీసుకెళ్లి మంగళూరు మార్గంలోని చార్మాడి కొండల్లో పడేశారు. మనోజ్ వెంట తీసుకొచ్చిన పుస్తకాలు, ఇతర వస్తువులను కాల్చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రూ. 2 కోట్ల విలువ చేసే బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఈ కేసులో ముగ్గురు నిందితులకు నగర 52వ అదనపు సివిల్, సెషన్స్ న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.

More Telugu News