Top US universities: బిలియనీర్లను సృష్టిస్తున్న అమెరికా యూనివర్సిటీలు

  • ఇక్కడ చదవడానికి సంపన్నుల ఆసక్తి
  • ఈ యూనివర్సిటీల్లో చదివితే భవిష్యత్తు బంగారం
  • టాప్ లో స్టాన్ ఫోర్డ్, హార్వర్డ్, యేల్ తదితర వర్సిటీలు
Where do the rich study Top US universities that produce future billionaires

గొప్ప చదువులు, జీవితానికి మంచి మార్గాన్ని ఇస్తాయి. మంచి సంపదకు బాటలు వేస్తాయి మెటా వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్ బర్గ్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ హార్వర్డ్ వర్సిటీలో విద్యను మధ్యలోనే ఆపేసి కెరీర్ ను మొదలు పెట్టిన వారు. అలాగే, ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే న్యూయార్క్ వర్సిటీలో చదువుకు డుమ్మా కొట్టిన వ్యక్తి. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్, 2023 జాబితాను పరిశీలించగా.. ఫోర్బ్స్ 400 బిలియనీర్లలో ఎక్కువ మంది చదువుకున్న కళాశాలల వివరాలు ఇవి..


స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ
క్యూఎస్ వరల్డ్ ర్యాంకుల్లో 2016 నుంచి టాప్ 3 యూనివర్సిటీల్లో స్టాన్ ఫోర్డ్ ఒకటిగా ఉంటోంది. స్నాప్ చాట్ సహ వ్యవస్థాపకులు ఎవాన్ స్పిజెల్, బాబీ ముర్ఫీ.. పేపాల్ పీటర్ థీల్, రోబ్లాక్స్ డేవిడ్ బస్ జుకీ వీరంతా స్టాన్ ఫోర్డ్ వర్సిటీ పూర్వపు విద్యార్థులు.

యూనివర్సిటీ ఆఫ్ సదర్న్ కాలిఫోర్నియా
స్టార్ వార్స్, ఇండియానా జోన్స్ మూవీ సిరీస్ ల వెనుకనున్న జార్జ్ లూకాస్, యూనివర్సిటీ ఆఫ్ సదర్న్ కాలిఫోర్నియా నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్డ్స్ లో బ్యాచిలర్ డిగ్రీ అందుకున్నవారే. సేల్స్ ఫోర్స్ సహ సీఈవో మార్క్ బెనీఆఫ్ .. ఏకంగా యూనివర్సిటీ ఆఫ్ సదర్న్ కాలిఫోర్నియా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ లో చోటు సంపాదించినవారే. రియల్ ఎస్టేట్ డెవలపర్ రిక్ కురాసో కూడా ఇదే వర్సిటీలో చదివినవారే .

యేల్ యూనివర్సిటీ
2012 నుంచి క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకుల్లో యేల్ వర్సిటీ టాప్10లో ఉంటోంది. ఎన్నో ప్రముఖ కంపెనీల సీఈవోలు ఈ వర్సిటీలో చదివిన వారే. మార్స్ చైర్మన్ జాన్ మార్స్ యేల్ వర్సిటీ మాజీ విద్యార్థి. బ్లాక్ స్టోన్ సీఈవో స్టీఫెన్ ష్వార్జ్ మాన్, జనరల్ అట్లాంటిక్ సీఈవో నీల్ బ్లూ కూడా యేల్ లో చదివినవారే.

హార్వర్డ్ వర్సిటీ
సంపన్నులకు ఇది ఇష్టమైన వర్సిటీ. క్యూఎస్ వర్సిటీ ర్యాంకుల్లో పదేళ్లుగా టాప్5లో ఉంటోంది. మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో స్టీవ్ బాల్మర్ హార్వర్డ్ లో చదివిన వారే. 

యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా
ఎలాన్ మస్క్ ఇక్కడే చదివారు. అలాగే, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ సైతం ఈ యూనివర్సిటీ పూర్వపు విద్యార్థిగా ఉన్నారు. ప్రముఖ ఇన్వెస్టర్ లారెన్స్ పావెల్ జాబ్స్, అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇలా ఎంతో మంది ఈ యూనివర్సిటీలో చదివారు.

More Telugu News