Vande Bharat Express: మొన్న గేదెలు, నిన్న ఆవు, నేడు వీల్ జామ్.... కొనసాగుతున్న వందేభారత్ రైలు కష్టాలు!

  • ఇటీవల వందేభారత్ రైలును ప్రారంభించిన మోదీ
  • రోజుకొక సమస్య ఎదుర్కొంటున్న రైలు
  • నేడు బిగుసుకుపోయిన చక్రం
Vande Bharat train face another difficulty third consecutive day

ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు రోజుకొక కష్టం వచ్చిపడుతోంది. మొన్న గేదెలను ఢీకొనడంతో వందేభారత్ రైలు ముందు భాగం డ్యామేజి అయింది. నిన్న ఆవును ఢీకొట్టింది. ఇవాళ తాజాగా వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు వీల్ జామ్ అయింది. 

ఈ రైలు ఢిల్లీ నుంచి వారణాసి వెళుతుండగా, ఓ బోగీ చక్రం బిగుసుకుపోయింది. దన్ కౌర్, వాయిర్ రైల్వే స్టేషన్ల మధ్య ఈ ఎక్స్ ప్రెస్ రైలు సీ8 కోచ్ లో వీల్ జామ్ అయినట్టు గుర్తించారు. ట్రాక్షన్ మోటార్ లో బేరింగ్ లోపం వల్లే ఇలా జరిగినట్టు భావిస్తున్నారు. ఈ లోపాన్ని గుర్తించిన రైల్వే గ్రౌండ్ స్టాఫ్ రైల్వే ఆపరేషన్స్ విభాగానికి సమాచారం అందించారు. కాగా, ఈ రైలు నిలిచిపోవడంతో, అందులోని ప్రయాణికులను శతాబ్ది రైలులోకి మార్చినట్టు తెలుస్తోంది. 

వరుసగా మూడో రోజు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావడం పట్ల సోషల్ మీడియాలో భిన్న స్పందనలు వస్తున్నాయి.

More Telugu News