Sensex: వరుసగా రెండో రోజు లాభపడ్డ మార్కెట్లు

  • మార్కెట్లకు విదేశీ పెట్టుబడుల అండ
  • 157 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 58 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. విదేశీ పెట్టుబడుల అండతో మార్కెట్లు పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 157 పాయింట్లు లాభపడి 58,222కి పెరిగింది. నిఫ్టీ 58 పాయింట్లు పుంజుకుని 17,331 వద్ద స్థిరపడింది. మెటల్ సూచీ 3.90 శాతం వరకు పెరిగింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (2.27%), ఎల్ అండ్ టీ (2.24%), ఐసీఐసీఐ బ్యాంక్ (2.04%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.98%), ఇన్ఫోసిస్ (1.76%). 

టాప్ లూజర్స్:
భారతి ఎయిర్ టెల్ (-2.53%), హిందుస్థాన్ యూనిలీవర్ (-2.08%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.52%), హెచ్డీఎఫ్సీ (-1.41%), బజాజ్ ఫైనాన్స్ (-1.18%).

More Telugu News