Wipro: ఈ నెల 10 నుంచి విప్రోలో హైబ్రిడ్ విధానం... అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్న ఐటీ ఉద్యోగులు

  • వారంలో 3 రోజుల పాటు ఆఫీస్‌కు రావాలన్న విప్రో
  • సోమ‌, మంగ‌ళ‌, గురు, శుక్ర‌వారాల్లో 3 రోజుల పాటు ఆఫీస్‌కు రావాల‌ని ఆదేశం
  • ఉద్యోగుల మ‌ధ్య స్నేహ‌పూర్వ‌క వాతావ‌ర‌ణానికే ఈ చ‌ర్య‌లంటూ మెయిల్‌
wipro asks its employees to come to office 3 days ina week

మూన్ లైటింగ్ ప‌ద్ద‌తిని ఆశ్ర‌యించి రెండేసి ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగుల‌పై ఇప్ప‌టికే వేటు వేసిన భార‌త ఐటీ దిగ్గ‌జం విప్రో తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌మ సంస్థ ఉద్యోగుల‌కు హైబ్రిడ్ ప‌ని విధానాన్ని అమ‌లు చేయ‌నున్న‌ట్లు ఆ సంస్థ ప్ర‌క‌టించింది. ఈ నెల 10 నుంచి హైబ్రిడ్ ప‌ని విధానాన్ని అమ‌లు చేయ‌నున్న‌ట్లు ఉద్యోగుల‌కు మెయిల్ ద్వారా తెలియ‌జేసింది. ఈ నిర్ణ‌యంపై విప్రో ఉద్యోగులు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. 

హైబ్రిడ్ ప‌ని విధానం ప్ర‌కారం ఉద్యోగులు వారానికి 3 రోజుల పాటు ఆఫీసుకు వ‌చ్చి ప‌నిచేయాల్సి ఉంటుంది. ఈ విధానంలో త‌మ ఉద్యోగులంతా ప్ర‌తి సోమ‌, మంగ‌ళ‌, గురు, శుక్ర‌వారాల్లో క‌నీసం 3 రోజుల పాటు ఆఫీసుకు వ‌చ్చి ప‌నిచేయాల‌ని విప్రో తెలిపింది. ఉద్యోగుల మ‌ధ్య స్నేహ‌పూర్వ‌క వాతావ‌ర‌ణాన్ని నెల‌కొల్పే దిశ‌గానే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ఆ సంస్థ వెల్ల‌డించింది.

More Telugu News