Karthi: దీపావళికి 'సర్దార్' సందడి .. డిఫరెంట్ లుక్స్ తో ఆసక్తిని రేపుతున్న కార్తి!

  • 'సర్దార్' గా విభిన్నమైన పాత్రలో కార్తి
  • సంగీత దర్శకుడిగా జీవీ ప్రకాశ్ కుమార్
  • కథానాయికలుగా రాశి ఖన్నా, రజీషా 
  • తమిళంతో పాటు తెలుగులోను రిలీజ్  
Sardar movie update

ఇటీవల పాన్ ఇండియా స్థాయిలో వచ్చిన 'పొన్నియిన్ సెల్వన్' లో కార్తి పాత్రకి మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాకి తెలుగులో ఆశించిన స్థాయి ఆదరణ లభించకపోయినా తమిళనాట రికార్డుస్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది. ఇక ఓవర్సీస్ లోను ఇదే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇదే నెలలో మరోసారి ప్రేక్షకులను పలకరించడానికి కార్తి రెడీ అవుతున్నాడు. కార్తి నుంచి రానున్న ఆ సినిమా పేరే 'సర్దార్'. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి, పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించాడు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను  'దీపావళి'కి రిలీజ్ చేయనున్నట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి కార్తి స్టిల్స్ ను రిలీజ్ చేశారు. డిఫరెంట్ గా కనిపిస్తున్న ఆయన స్టిల్స్ ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ సినిమాలో ఆయన సరసన నాయికలుగా రజీషా విజయన్ - రాశి ఖన్నా నటించారు. తెలుగులో ఈ మధ్య కాలంలో వచ్చిన రాశి ఖన్నా సినిమాలు ఆమెకి నిరాశనే మిగిల్చాయి. తమిళంతో పాటు తెలుగులోను విడుదల కానున్న ఈ సినిమాపై ఆమె గట్టిగానే ఆశలు పెట్టుకుంది. మరి ఈ సినిమాతో ఆమె ఆశించిన సక్సెస్ లభిస్తుందేమో చూడాలి.

More Telugu News