Kerala: కేరళ ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టూరిస్టు బస్సు.. విద్యార్థులు సహా 9 మంది దుర్మరణం

  • విహారయాత్రకు ఊటీ వెళ్తున్న విద్యార్థులు
  • కేరళ ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టూరిస్టు బస్సు
  • గాయపడిన వారిలో మరో 12 మంది పరిస్థితి విషమం
  • మృతుల్లో టీచర్.. ముగ్గురు ఆర్టీసీ ప్రయాణికులు
9 dead and 35 hurt as tourist vehicle  ends govt bus in Keralas Palakkad

కేరళలో గత అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. పాలక్కాడ్‌లోని వడక్కంచేరిలో జరిగిందీ ఘటన. విద్యార్థులతో కూడిన ఓ టూరిస్టు బస్సు కేరళ ఆర్టీసీ బస్సును వెనక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు, ఓ టీచర్, ముగ్గురు కేఎస్‌ఆర్టీసీ ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన 35 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

ఎర్నాకుళం జిల్లాలోని బేసెలియస్ విద్యానికేతన్‌కు చెందిన విద్యార్థులు, టీచర్లు విహార యాత్ర కోసం తమిళనాడులోని ఊటీ వెళ్తుండగా, కేఎస్ ఆర్టీసీ బస్సు కోయంబత్తూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, గాయపడిన వారిలో మరో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

More Telugu News