Hero: ఆకట్టుకునే ఫీచర్లతో రాబోతున్న హీరో విదా ఎలక్ట్రిక్ స్కూటర్

  • స్వాపబుల్ బ్యాటరీ టెక్నాలజీపై అంచనాలు
  • ఏథర్ ఎనర్జీ చార్జింగ్ సదుపాయాలను వినియోగించుకునే వెసులుబాటు
  • 7న విడుదల కానున్న విదా స్కూటర్
Hero Vida electric scooter to get best in class features

హీరో మోటో కార్ప్ తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ను దేశీ మార్కెట్లోకి ఈ నెల 7న విడుదల చేయబోతోంది. ఇందులో కొన్ని ప్రత్యేక ఫీచర్లు ఉండనున్నాయి. హీరో ఎలక్ట్రిక్ పేరుతో మార్కెట్లో కనిపించే ఎలక్ట్రిక్ టూ వీలర్లు.. హీరో మోటోకార్ప్ నకు సంబంధించినవి కావు. ఇవి అన్నదమ్ముల కంపెనీలు. హీరో మోటోకార్ప్ నుంచి ఎలక్ట్రిక్ వాహనం రావడం ఇదే మొదటిసారి.

ముఖ్యంగా స్వాపబుల్ బ్యాటరీ ఆప్షన్ తో విదా స్కూటర్ రానున్నట్టు మార్కెట్లో అంచనాలున్నాయి. స్వాపబుల్ బ్యాటరీ టెక్నాలజీపై కలసి పనిచేసేందుకు హీరో మోటోకార్ప్ ఇప్పటికే తైవాన్ కు చెందిన గొగోరో కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అంతేకాదు, ఏథర్ ఎనర్జీతోనూ హీరో మోటో కార్ప్ నకు భాగస్వామ్యం ఉంది. కనుక ఏథర్ చార్జింగ్ సదుపాయాలను హీరో విదా కస్టమర్లు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ‘మీ స్కూటర్ ను ఇంట్లో, పార్కింగ్ ప్రదేశాల్లో, లేదా బహిరంగ స్టేషన్లలో చార్జ్ చేసుకోవచ్చు’అంటూ హీరో మోటోకార్ప్ ఇటీవలే ట్వీట్ చేసింది.

పోటీ సంస్థలైన బజాజ్, టీవీఎస్ సంస్థలు ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఏడాది, రెండేళ్ల క్రితమే పరిచయం చేయగా.. హీరో మోటో మాత్రం చాలా కాలంగా అభివృద్ధి దశలోనే ఆగిపోయింది. 2 లక్షల కిలోమీటర్ల మేర ఈ స్కూటర్ ను నడిపించి పరీక్షించింది. విడుదల అయిన తర్వాతే స్కూటర్ సామర్థ్యం, ఫీచర్ల గురించి స్పష్టమైన సమాచారం తెలిసే అవకాశం ఉంటుంది. 

More Telugu News