Nagarjuna: 'ది ఘోస్ట్' నుంచి సాంగ్ రిలీజ్!

  • 'ది ఘోస్ట్'గా నాగార్జున 
  • యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ 
  • దర్శకుడిగా ప్రవీణ్ సత్తారు 
  • రేపు విడుదలవుతున్న సినిమా  
The Ghost movie song released

నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 'ది ఘోస్ట్' సినిమా రూపొందింది. శ్రీ వేంకటేశ్వర సినిమాస్ - నార్త్ స్టార్ వారు కలిసి ఈ సినిమాను నిర్మించారు. మార్క్ కె రాబిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించిన ఈ సినిమాను, ఈ నెల 5వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి భరత్ - సౌరభ్ బాణీ కట్టిన ర్యాప్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

'దూరాలైనా .. తీరాలైనా .. దేహాలకే కాదా, మదిలో మెదిలే అనుబంధాలే జీవితమంతా రావా' అంటూ ఈ పాట ఎమోషనల్ యాంగిల్ ను టచ్ చేస్తూ సాగుతోంది. మనోజ్ కుమార్ జూలూరి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను రోల్ రైడా -  అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ప్రధానమైన పాత్రలు అనుభవిస్తున్న మానసిక సంఘర్షణపై ఈ నేపథ్య గీతం ప్లే అవుతూ ఉంటుంది. 

ఈ సినిమాలో నాగార్జున ఇంటర్ పోల్ ఏజెంట్ గా కనిపించనున్నారు. ఆయన సరసన నాయికగా సోనాల్ అలరించనుంది. ఈ సినిమాలో ఆమెపై కూడా యాక్షన్ సీన్స్ ఉన్నాయి. 'గరుడవేగ' హిట్ తరువాత ప్రవీణ్ సత్తారు .. 'బంగార్రాజు' హిట్ తరువాత నాగార్జున కలిసి చేసిన  ఈ సినిమాపై సహజంగానే అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా అందుకుంటుందేమో చూడాలి.

More Telugu News