Cheetahs: లంపీ వైర‌స్‌ను వ్యాప్తి చేయ‌డానికే కేంద్రం చీతాల‌ను తెచ్చిందంటూ మ‌హారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వింత విమ‌ర్శ‌

  • లంపీ వైర‌స్‌ను వ్యాప్తి చేయ‌డానికే కేంద్రం చీతాల‌ను తెచ్చింద‌న్న మ‌హారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్‌ నానా ప‌టోలే 
  • చీతాలు న‌మీబియా నుంచి వ‌స్తే నైజీరియా నుంచి వ‌చ్చాయ‌ని వ్యాఖ్య‌
  • నైజీరియా, న‌మీబియా రెండూ వేర్వేరు దేశాల‌ని కూడా ఆయ‌న‌కు తెలియ‌ద‌ని బీజేపీ ఎద్దేవా
Cheetahs from Nigeria got Lumpy Virus to India says Maha Congress chief

దేశంలో పశువులను పీడిస్తున్న లంపీ వైరస్ వ్యాధిని న‌మీబియా నుంచి తీసుకొచ్చిన చీతాలకు ముడిపెట్టి పరుగు పోగొట్టుకున్నారు ఓ కాంగ్రెస్ నాయ‌కుడు. ఈ విష‌యంలో కేంద్రంపై దాడి చేసే క్ర‌మంలో మోదీ స‌ర్కారు తెచ్చిన  నైజీరియా చిరుతలే  (న‌మీబియా నుంచి తెచ్చారు) భార‌త్‌లో ఈ వ్యాధికి వాహ‌కాలు అని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఈ చిరుత‌ల‌ను కేంద్రం.. న‌మీబియా నుంచి తీసుకురాగా ప‌టోలే నైజీరియా అన్నారు.  “ఈ లంపీ వైరస్ చాలా కాలంగా నైజీరియాలో ఉంది. చీతాల‌ను కూడా అక్కడి నుంచే తీసుకువచ్చారు. రైతులు నష్టపోయేలా కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసింది. విదేశాల నుంచి చీతాలను తీసుకురావడం వల్ల దేశంలోని రైతుల సమస్యలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యలు పరిష్కారం కావు. దేశంలో లంపీ వైరస్ వ్యాప్తి చెందించ‌డం కోసమే చీతాల‌ను తీసుకువచ్చారు” అని ఆయ‌న‌ పేర్కొన్నారు. 
 
నానా పటోలే విచిత్రమైన వ్యాఖ్యలు, ఆరోపణలపై బీజేపీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. పటోలేను "మహారాష్ట్ర రాహుల్ గాంధీ" అని షెహజాద్ పూనావాలా ఎద్దేవా చేశారు. “లంపీ వైరస్ నైజీరియాలో పుట్టిందని, మోదీ చీతాలను తీసుకురావడం వల్లే  వైర‌స్ దేశంలోకి వచ్చిందని మహారాష్ట్ర రాహుల్ గాంధీ అయిన నానా పటోలే అంటున్నారు. చిరుతలు వ‌చ్చింది నమీబియా నుంచి... నైజీరియా నుంచి కాదు. అసలు నైజీరియా, నమీబియా వేర్వేరు దేశాలని ఆయ‌న‌కు తెలుసా? కాంగ్రెస్ ఎప్పుడూ ఇలాంటి అబద్ధాలు, పుకార్లు ప్రచారం చేస్తూనే ఉంటుంది’’ అని ఎద్దేవా చేశారు.

More Telugu News