Congress: హైద‌రాబాద్ మీదుగా రాహుల్ యాత్ర‌... రెండు రూట్ల‌ను సిద్ధం చేసిన టీ కాంగ్రెస్‌

  • ఈ నెల 24న తెలంగాణ‌లోకి ప్ర‌వేశించ‌నున్న రాహుల్ యాత్ర‌
  • డీజీపికి రెండు రూట్ మ్యాప్‌లు అందించిన రేవంత్ రెడ్డి
  • చార్మినార్‌, గాంధీ భ‌వ‌న్‌, జూబ్లీహిల్స్, ప‌టాన్‌చెరు మీదుగా తొలి రూట్‌
  • శంషాబాద్‌, రాజేంద్ర‌న‌గ‌ర్‌, హెచ్‌సీయూ, బీహెచ్ఈఎల్ మీదుగా వెళ్లేలా మ‌రో రూట్ మ్యాప్‌
tpcc proposes two route for rahul gandhi yatra in hyderabad

భార‌త్ జోడో యాత్ర పేరిట కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేప‌ట్టిన పాద‌యాత్ర తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ మీదుగా వెళ్ల‌నుంది. ఈ నెల 24న ఈ యాత్ర తెలంగాణ‌లోకి ప్ర‌వేశించ‌నున్న సంగ‌తి తెలిసిందే. తెలంగాణ‌లో రాహుల్ యాత్ర‌కు సంబంధించి రూట్ మ్యాప్‌ల‌ను సిద్ధం చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి... పోలీసుల అనుమ‌తి కోసం నేడు రాష్ట్ర డీజీపీ మ‌హేందర్ రెడ్డిని క‌లిశారు. ఈ సంద‌ర్భంగా రెండు రూట్ మ్యాప్‌ల‌ను డీజీపీకి అంద‌జేశారు. వీటిలో ఒక‌దానిని పోలీసులు అనుమ‌తించ‌నున్నారు.

హైద‌రాబాద్‌లో రాహుల్ యాత్ర‌కు సంబంధించి రెండు రూట్ మ్యాప్‌ల‌ను టీపీసీసీ ఖ‌రారు చేయ‌గా... అందులో చార్మినార్ నుంచి గాంధీ భ‌వ‌న్, జూబ్లీ హిల్స్ మీదుగా ప‌టాన్‌చెరు చేరుకునేలా ఓ రూట్ మ్యాప్‌ను సిద్ధం చేశారు. ఇక రెండో రూట్ శంషాబాద్ నుంచి రాజేంద్ర న‌గ‌ర్‌, హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ (హెచ్‌సీయూ), బీహెచ్ఈఎల్ మీదుగా వెళ్ల‌నుంది. ఈ రెంటిలో పోలీసులు దేనికి అనుమ‌తి ఇస్తార‌న్న‌ది త్వ‌ర‌లోనే తేల‌నుంది.

More Telugu News