Commercial LPG: మరింత తగ్గిన వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర

  • ఒక్కో సిలిండర్ పై రూ.25-32 వరకు తగ్గింపు
  • అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గిన ప్రభావం
  • తక్షణమే అమల్లోకి వచ్చిన కొత్త రేట్లు
  • గృహ ఎల్పీజీ సిలిండర్ల ధరలో మార్పు లేదు
Commercial LPG cylinder prices slashed  Check out latest rates

వాణిజ్య ఎల్పీజీ వినియోగదారులపై కొంత భారం తగ్గింది. 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయాన్ని ప్రకటించాయి. ఢిల్లీలో రూ.25.50, కోల్ కతాలో రూ.36.50, ముంబైలో రూ.32.50, చెన్నైలో రూ.35.50 చొప్పున ధర తగ్గింది. తగ్గింపు తర్వాత మార్కెట్ ధర ఢిల్లీలో రూ.1,859గా ఉంది. కోల్ కతాలో రూ.1,959, ముంబైలో రూ.1,811.50గా ఉంది. 

చెన్నై మార్కెట్లో రూ.2,009.50కు దిగొచ్చింది. గత నెల 1వ తేదీన 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ.91.50 తగ్గడం గమనార్హం. దేశవ్యాప్తంగా ఎల్పీజీ ధరలు ఒకే విధంగా ఉండవు. రవాణా, ఇతర పన్నులతో కలుపుకుని ధరల్లో మార్పు ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గిన ఫలితం ఇక్కడి ధరలపై ప్రభావం చూపించింది. ఇక గృహ వాణిజ్య సిలిండర్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు. 

More Telugu News