Shashi Tharoor: అధ్యక్ష ఎన్నికకు నామినేషన్లు వేసిన ఖర్గే, శశి థరూర్.. బరిలోకి దిగిన మరో నేత!

  • అధ్యక్ష ఎన్నికకు పూర్తయిన నామినేషన్
  • ఖర్గే, థరూర్ తో పాటు నామినేషన్ వేసిన కేఎన్ త్రిపాఠి
  • అక్టోబర్ 17న జరగనున్న ఎన్నిక
One more leader files nomination for president elections

కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం చివరకు మల్లికార్జున ఖర్గే, శశి థరూర్ బరిలో నిలిచారు. కాసేపటి క్రితం నామినేషన్ల పర్వం పూర్తయింది. కేవలం ఖర్గే, థరూర్ మాత్రమే నామినేషన్ వేశారు. మరోవైపు హైకమాండ్ సూచనలో ఖర్గే బరిలోకి దిగారని తెలుస్తోంది. గాంధీల విధేయుడిగా ఖర్గేకు పేరుంది. ఈ నేపథ్యంలో హైకమాండ్ కు విధేయులైన వారందరూ ఖర్గేకు అండగా నిలిచే అవకాశం ఉంది. 'జీ 23' నేతలైన మనీశ్ తివారీ, ఆనంద్ శర్మ వంటి వారు కూడా ఖర్గేకే మద్దతు ప్రకటించారు.

ఇక ఈరోజు చోటు చేసుకున్న మరో ఆసక్తికర పరిణామం ఏమిటంటే... ఖర్గే, థరూర్ లతో పాటు మరో అభ్యర్థి కూడా నామినేషన్ వేశారు. ఝార్ఖండ్ మాజీ మంత్రి కేఎన్ త్రిపాఠి నామినేషన్ దాఖలు చేశారు. అక్టోబర్ 1న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు అక్టోబర్ 8 వరకు గడువు ఉంది. అక్టోబర్ 17న ఎన్నిక జరుగుతుంది. 19న ఫలితాలు వెల్లడికానున్నాయి.

More Telugu News