Chiranjeevi: మెగాస్టార్ కి మాత్రమే సరిపోయే టైటిల్ 'గాడ్ ఫాదర్': రామజోగయ్య శాస్త్రి

  • అనంతపురంలో 'గాడ్ ఫాదర్' ప్రీ రిలీజ్ ఈవెంట్
  • భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు
  • లైవ్ షో ఇచ్చిన తమన్ 
  • చిరూకి పాటలు రాయడం తన అదృష్టమన్న రామజోగయ్య శాస్త్రి
God Father movie Pre Release Event

చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన 'గాడ్ ఫాదర్' సినిమా, దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును అనంతపురం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో నిర్వహించారు. పొలిటికల్ డ్రామాను టచ్ చేస్తూ ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగే కథ ఇది. 

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామజోగయ్యశాస్త్రి మాట్లాడుతూ .."చిరంజీవిగారి ఫేస్ లో ఒక ప్రత్యేకమైన చిరునవ్వు ఉంటుంది. నా పట్ల ఆయనకి గల అభిమానాన్ని ఆయన కళ్లలో చూశాను. అందుకే మెగాస్టార్ ను మరోసారి కలుసుకోవాలనే ఉత్సాహంతో చిన్నపిల్లాడిలా ఈ ఫంక్షన్ కి రావడం జరిగింది. నా ఆశ ఇప్పుడే నెరవేరింది. 

'గాడ్ ఫాదర్' అనే టైటిల్ పెట్టాలంటే ఒకటికి వందసార్లు ఆలోచన చేయాలి. ఆ పేరుకు ఒక్క చిరంజీవిగారు మాత్రమే సరిపోతారు. ఇందాక రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తేనే ఆయన పవర్ ఏమిటనేది అర్థమైపోతోంది. బ్లాక్ బస్టర్ సినిమాల రాశిపై కూర్చున్నప్పటికీ, ఇప్పటికీ కూడా మొదటి సినిమాకి పనిచేస్తున్నంత ఉత్సాహాన్ని చూపుతుంటారు. అలాంటి ఆయన కోసం ఈ సినిమాలో మూడు పాటలు రాసే అవకాశం లభించడం నా అదృష్టం" అంటూ చెప్పుకొచ్చారు.

More Telugu News