Chiranjeevi: నేను ఉన్నంతవరకూ ఈ కుర్చీకి చెద పట్టనివ్వను: 'గాడ్ ఫాదర్' ట్రైలర్ రిలీజ్

  • 'గాడ్ ఫాదర్' గా మెగాస్టార్
  • పొలిటికల్ డ్రామా నేపథ్యంలో నడిచే కథ 
  • కీలకమైన పాత్రలో సల్మాన్ 
  • అక్టోబర్ 5వ తేదీన సినిమా రిలీజ్  
God Father Movie Trailer Released

చిరంజీవి కథానాయకుడిగా మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్' సినిమా రూపొందింది. ఎన్వీ ప్రసాద్ - ఆర్.బి. చౌదరి నిర్మించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. అక్టోబర్  5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. 

"ముఖ్యమంత్రి పీకేఆర్ ఆకస్మిక మరణం .. అతని మరణంతో రాజకీయపరమైన డ్రామాలు మొదలుకావడం .. ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఎవరికివారు వ్యూహాలు పన్నడం .. ఆ పదవికి అన్ని రకాల అర్హతలు వున్న వ్యక్తి" అనే  వాయిస్ ఓవర్ పై 'గాడ్ ఫాదర్' ఎంట్రీ .. ట్రైలర్ కి హైలైట్ గా నిలిచాయి. 

'నేను ఉన్నంతవరకూ ఈ కుర్చీకి చెద పట్టనివ్వను' అనే చిరూ డైలాగ్ ట్రైలర్ స్థాయిని పెంచింది. 'గాడ్ ఫాదర్'కి అనుకోని సవాళ్లు ఎదురైనప్పుడు అతనికి అండగా నిలిచే సోల్ గా సల్మాన్ ఎంట్రీ చూపించారు. ఈ ఇద్దరి కాంబినేషన్లోని ఫైట్స్ .. డాన్స్ మెగా అభిమానులకు పండగ చేస్తాయనే విషయం ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది.

More Telugu News