Gujarat: అహ్మ‌దాబాద్‌లో అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యాల‌ను త‌ల‌ద‌న్నేలా రైల్వే స్టేష‌న్‌... ఊహా చిత్రాలు ఇవిగో

  • అహ్మ‌దాబాద్‌లో స‌రికొత్త హంగుల‌తో రైల్వే స్టేషన్‌
  • వ‌ర‌ల్డ్ క్లాస్ ప్రమాణాలతో నిర్మించేందుకు కేంద్రం నిర్ణ‌యం
  • ఊహా చిత్రాల‌ను విడుద‌ల చేసిన కేంద్ర మంత్రి గోయ‌ల్‌
central government will built a world class railway station in Ahmedabad

గుజ‌రాత్ వాణిజ్య రాజ‌ధానిగా ప్ర‌సిద్ధికెక్కిన అహ్మాదాబాద్‌లో అంత‌ర్జాతీయ స్థాయి ప్రమాణాల‌తో ఓ రైల్వే స్టేష‌న్‌ను నిర్మించేందుకు కేంద్రం సూత్ర‌ప్రాయంగా నిర్ణ‌యించింది. వ‌ర‌ల్డ్ క్లాస్ వ‌స‌తుల‌తో అల‌రారుతున్న అంత‌ర్జాతీయ విమానాశ్రయాల్లో ఏ ఒక్క ఎయిర్ పోర్టుకు తీసిపోని విధంగా ఈ రైల్వే స్టేష‌న్‌ను తీర్చిదిద్దనున్న‌ట్లు స‌మాచారం. 

ఈ మేర‌కు అహ్మాదాబాద్‌లో నిర్మించ‌నున్న వ‌రల్డ్ క్లాస్ రైల్వే స్టేష‌న్ ఊహా చిత్రాల‌ను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బుధ‌వారం సోష‌ల్ మీడియా వేదిక‌గా విడుద‌ల చేశారు. త్వ‌ర‌లోనే అహ్మ‌దాబాద్ ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి రానున్న ఈ రైల్వే స్టేష‌న్ వ‌స‌తుల విష‌యంలో ఏ ఒక్క అంత‌ర్జాతీయ విమానాశ్రయానికి తీసిపోద‌ని గోయ‌ల్ పేర్కొన్నారు. అహ్మ‌దాబాద్‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఇస్తున్న మ‌రో బ‌హుమ‌తిగా ఈ రైల్వే స్టేష‌న్ నిల‌వ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

More Telugu News