Navaratri: ఓలా ఎలక్ట్రిక్ నవరాత్రి డిస్కౌంట్

  • ఎస్ 1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.10,000 తగ్గింపు
  • రూ.1,29,999కి దిగొచ్చిన ఎక్స్ షోరూమ్ ధర
  • సున్నా వడ్డీపై రుణం
Navaratri festive offer Ola S1 Pro has flat Rs 10000 discount

దేవీ నవరాత్రి వేడుకల సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ తన కస్టమర్లకు ఆఫర్లను ప్రకటించింది. ఓలా ఎస్ 1 ప్రో స్కూటర్ కొనుగోలు చేసిన వారికి రూ.10,000 తగ్గింపు లభిస్తుంది. దీంతో ఓలా ఎస్ 1 ప్రో ఎక్స్ షోరూమ్ ధర రూ.1,29,999కు తగ్గిపోయింది. అక్టోబర్ 5 వరకు ఈ ఆఫర్ అమల్లో ఉంటుంది. నూతన కొనుగోళ్లపైనే ఈ డిస్కౌంట్ లభిస్తుంది. 


ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు విషయంలో మనకు కనిపించని ఇతర ధరలు కూడా ఉన్నాయి. హోమ్ చార్జర్ ధర రూ.15,000. ఈ స్కూటర్ కు 8.5 కిలోవాట్ మోటార్, 4 కిలోవాట్ బ్యాటరీ ఉన్నాయి. దీనిపై గరిష్ఠంగా 116 కిలోమీటర్ల వేగంతో వెళ్లొచ్చని ఓలా చెబుతోంది. పూర్తి చార్జింగ్ కు 6 గంటల 30 నిమిషాలు పడుతుంది.  

ఇక నవరాత్రి పర్వదిం సందర్భంగా వాహన కొనుగోలుకు రుణాన్ని సున్నా వడ్డీపై పొందొచ్చు. రుణాలపై వడ్డీ రేటును 8.99 శాతానికి తగ్గించింది. ఐదేళ్ల ఎక్స్ టెండెడ్ వారంటీపై రూ.1,500 డిస్కౌంట్ ను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది.

More Telugu News