Nagashaurya: బ్రహ్మాజీ ఈ ఇంటర్వ్యూ చూడకూడదు: వెన్నెల కిశోర్

  • ఇటీవలే థియేటర్లకి వచ్చిన 'కృష్ణ వ్రింద విహారి'
  • కొనసాగుతూనే ఉన్న ప్రమోషన్స్ 
  • వెన్నెల కిశోర్ ఇంటర్వ్యూలో బ్రహ్మాజీ ప్రస్తావన 
  • ఆయన వయసును గురించి టాపిక్ తో సరదాగా సాగిన ఇంటర్వ్యూ    
krishna Vrinda Vihari Team Interview

నాగశౌర్య హీరోగా దర్శకుడు అనీష్ కృష్ణ రూపొందించిన 'కృష్ణ వ్రింద విహారి' సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో కథానాయికగా షెర్లీ సెటియా పరిచయం కాగా, ముఖ్యమైన పాత్రలలో వెన్నెల కిశోర్ .. బ్రహ్మాజీ .. అన్నపూర్ణమ్మ నటించారు. రిలీజ్ తరువాత కూడా ఈ సినిమా టీమ్ ప్రమోషన్స్ కొనసాగిస్తూనే ఉంది. అందులో భాగంగానే ఈ సినిమా దర్శకుడిని .. నాగశౌర్యను వెన్నెల కిశోర్ ఇంటర్వ్యూ చేశాడు. 

ఈ సినిమాలో నాగశౌర్యకి బావ పాత్రలో బ్రహ్మాజీ నటించడం గురించి వెన్నెల కిశోర్ ప్రస్తావించాడు. కథాపరంగా నాగశౌర్య చెల్లెలి పాత్రను బ్రహ్మాజీకి ఇచ్చి ఆమె గొంతుకోశారంటూ నవ్వులు పూయించాడు. దర్శకుడు పదో తరగతి చదువుతున్నప్పుడు బ్రహ్మాజీ 'గులాబీ' సినిమా చేశారంటే, ఆయన వయసు 60కి పైగా ఉంటుందని అన్నాడు. 

ఈ సినిమాలో అన్నపూర్ణమ్మ పాత్రను గురించి ఆయన ప్రస్తావిస్తూ, అన్నపూర్ణమ్మ .. బ్రహ్మాజీ ఇద్దరూ కూడా సేమ్ జనరేషన్ కి చెందినవాళ్లని అన్నాడు. ఆయన ఈ ఇంటర్వ్యూ చూడకుండా చూడాలంటూ నవ్వేశాడు. ఈ సినిమాలో బ్రహ్మాజీ వయసుకంటే ఆయన మావగారి పాత్రను వేసిన జయప్రకాశ్ వయసు తక్కువగా ఉంటుందనీ , ఆయనకి 'గులాబీ' సినిమాను చూపించాలి" అంటూ సందడి చేశాడు. ఇలా ఆద్యంతం ఈ ఇంటర్వ్యూ సరదాగా సాగిపోయింది.

More Telugu News