GVL Narasimha Rao: "నువ్వు వారసుడివా" అని జూనియర్ ఎన్టీఆర్ ను వెక్కిరించడం రాజకీయ వికృతానికి పరాకాష్ఠ: జీవీఎల్

  • ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్చిన ఏపీ సర్కారు
  • భగ్గుమన్న విపక్షాలు
  • స్పందించిన జీవీఎల్
GVL tweets on health university name change issue

విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. 

యుగ పురుషుడు ఎన్టీఆర్ గారి నుంచి టీడీపీని దక్కించుకోవడం కోసం ఒకప్పుడు ఒక పోటు పొడిచి ఆయన మరణానికి కారకులైనవారు ఇవాళ ఆయనపై అతి ప్రేమ కనబరుస్తున్నారని విమర్శించారు. వారు జూనియర్ ఎన్టీఆర్ ను "నువ్వు వారసుడివా" అని వెక్కిరించడం, అవమానించడం, కార్యకర్తలను ఉసిగొల్పడం రాజకీయ వికృతానికి, దగా రాజకీయాలకు పరాకాష్ఠ అని పేర్కొన్నారు. 

భగవంతుడి ప్రతిరూపంగా ప్రజల మనసులో నిలిచిన ఎన్టీఆర్ గారిని వివాదంలోకి లాగడం ద్వారా వైసీపీ ముమ్మాటికీ దుర్మార్గానికి పాల్పడిందని జీవీఎల్ విమర్శించారు. 

ప్రభుత్వ వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చారని ఆరోపించారు. ఎన్టీఆర్ గారి మనసును మీ వికృత రాజకీయాల కోసం క్షోభ పెట్టొద్దు సీఎం జగన్ అంటూ జీవీఎల్ హితవు పలికారు.

More Telugu News